నకిలీ వాహన భీమా పాలసీలు చేస్తున్న 10 మంది అరెస్టు

10 arrested for making fake vehicle insurance policies in warangal

 

నకిలీ వాహన భీమా పాలసీలు చేస్తున్న రెండు ముఠాలను వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు ముఠాలకు చెందిన 8మంది నిందితులతో పాటు అనాధికారికంగా వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు కార్డులను కలిగి వున్నఆర్టీఏ ఆఫీస్ కార్యకలాపాలను నిర్వహించే మరో ఇద్దరు దళారీలను అరెస్ట్ చేశారు. మొత్తం పది మంది నిందితులను టాస్క్ ఫోర్స్, మిల్క్ కాలనీ, ఇంతేజార్ గంజ్ పోలీసులు కలసి అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అయిన వారి నుండి 4లక్షల 46వేల నగదు, 3 ల్యాప్ ట్యా న్లు , 2 డెస్క్టాప్ కంప్యూటర్లు, 4 ప్రింటర్లు, 5ద్విచక్ర వాహనాలు, పది సెల్ ఫోన్లతో పాటు 433 వాహన రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సు కార్డులు, రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు, నకిలీ భీమా పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారంతా వరంగల్ ట్రై సిటీస్ కు చెందిన వారే కావడం గమనార్హం. నకిలీ వాహన బీమా పాలసీలు చేస్తున్నవారి అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ నిందితులందరూ వాహన భీమా మరియు రోడ్డు రవాణా శాఖ దళారీలుగా వరంగల్ రోడ్డు రవాణా శాఖ కార్యాలయము పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నారని తెలిపారు.