యూపీ రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

road accident

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో 10 మంది చనిపోయారు. ఫిలిబిత్‌లోని పురాణ్‌పూర్‌ జాతీయ రహదారిపై గజ్‌రౌలా సమీపంలో ఇవాళ (గురువారం) ఈ ప్రమాదం జరిగింది. ఈ ట్రక్కులో మొత్తం 17 మంది ప్రయాణిస్తుండగా.. 10 మంది చనిపోగా.. ఏడుగురు గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది.

గంగానదిలో స్నానం చేసి హరిద్వార్‌ వస్తుండగా ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్‌ కారణమని తెలిపారు.యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.