శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 11 లక్షల బంగారం పట్టివేత

shamshabad airport

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించి పట్టుకున్నారు.

కువైట్ నుండి వస్తున్న గుర్ర నరేందర్ అనే ప్రయాణికుడి దగ్గర నిబంధనలకు విరుద్ధంగా 11 లక్షల విలుల చేసే బంగారం ఉండటాన్ని గుర్తించి సీజ్ చేశారు.

నిందితుడు ఇండియాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. విచారణ చేస్తున్నారు.