118 భారీ అర్జున్‌ యుద్ధ ట్యాంకులకు కేంద్రం ఆర్డర్‌.. ఒప్పందం విలువ ఎంతంటే? - TNews Telugu

118 భారీ అర్జున్‌ యుద్ధ ట్యాంకులకు కేంద్రం ఆర్డర్‌.. ఒప్పందం విలువ ఎంతంటే?దేశభద్రతే లక్ష్యంగా సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శత్రుసేనలకు చుక్కలు చూపెట్టే సామర్థ్యం ఉన్న 118 అర్జున్‌ మెయిన్‌ బ్యాటిల్‌ ట్యాంక్‌ (ఎంబీటీ)లను కొనేందుకు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది.

రూ.7,523 కోట్లతో కొనుగోలు ఎంబీటీలను చేసేందుకు కేంద్ర రక్షణశాఖ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు చెన్నై ఆవడిలో హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీ (HVF)కి ఆర్డర్‌ ఇచ్చింది.

MBT MK-1A కొత్త వేరియంట్ అర్జున్‌ ట్యాంక్‌.. ఫైర్‌ పవర్‌, స్పీడ్, శత్రు ట్యాంకులను అడ్డుకోవడం, రాత్రి-పగటి వేళల్లో పనిచేయడం లాంటి 72 ఆధునిక ఫీచర్లు దీని సొంతం. పైగా ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకోవడం దీని మరో ప్రత్యేకత.