119 నీలిచిత్రాలు రూ. 9 కోట్లకు బేరం పెట్టిండు. ఫోన్ నిండా అవే సినిమాలు

అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా గురించి మరిన్ని సంచలన విషయాలు తెలిశాయి. ఒక్కటి కాదు రెండు కాదు తను వందల కొద్దీ ఇలాంటి సినిమాలే తీశాడంట. తన ఫోన్ లోనే ఏకంగా 119 అశ్లీల సినిమాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దాదాపు రెండు నెలల పాటు రాజ్ కుంద్రా పోలీసుల కస్టడీలో ఉన్నారు. విచారణ లో భాగంగా రాజ్ కుంద్రా లాప్ టాప్, హాట్ డ్రైవ్, డిస్క్ లను పోలీసులు పరిశీలించారు. అందులో చాలా నీలి చిత్రాలు ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఆ వీడియోలను ఆయన దాదాపు 9 కోట్ల రూపాయలకు అమ్మేసేందుకు బేరం కుదుర్చుకున్నారన్నారు. ఈ వ్యాపారం ద్వారా రాజ్ కుంద్రా పెద్ద మొత్తంలోనే సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.

 

5 నెలల పాటు దర్యాప్తు

రాజ్ కుంద్రా చాలా రోజులుగా కొన్ని యాప్స్ ద్వారా అశ్లీల చిత్రాలు తీస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి లో ముంబయి అవుట్ స్కర్ట్ లో ‘మాద్‌ దీవి’ దగ్గర ఓ బంగ్లాలో అశ్లీల సినిమా తీస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించగా…అక్కడున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 5 నెలల పాటు దర్యాప్తు చేసి మొత్తం పోర్న్ రాకెట్ గుట్టు బయట పెట్టారు. ఈ క్రమంలోనే హాట్ యాప్స్ ద్వారా రాజ్ కుంద్రా చేస్తున్న అశ్లీల దందా బయట పడింది. ఐతే రెండు నెలల పాటు కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రా కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.