16వ రౌండ్‌ పూర్తి.. బీజేపీకి 1772 ఓట్ల లీడ్

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో ఇప్పటివరకు 16రౌండ్ల లెక్కింపు పూర్తి అయింది. 16వ రౌండ్ లెక్కింపులో గెల్లు శ్రీనివాస్‎కు 3,917 ఓట్లు.. ఈటలకు 5,689 ఓట్లు వచ్చాయి.

బీజేపీ 1,772 ఓట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. 16 రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీకి 74,275 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‎కు 60,920 ఓట్లు వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 13,195 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.