కెనడా ఎన్నికల్లో భారతీయుల హవా.. 17మంది ఎంపీలుగా ఎన్నిక - TNews Telugu

కెనడా ఎన్నికల్లో భారతీయుల హవా.. 17మంది ఎంపీలుగా ఎన్నికకెనడా ఎన్నికల్లో వరుసగా మూడోసారి జస్టిన్ ట్రూడో ప్రధానికగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ప్రధానంగా లిబరల్ పార్టీ, న్యూ డెమోక్రటిక్ పార్టీలు తలపడుతున్నా.. సరైన మెజారిటీ రాకపోయినా లిబరల్ పార్టీయే అధికారాన్ని చేపట్టనుంది. కాగా.. ఈ సారి ఎన్నికల్లో 17 మంది భారత సంతతి వ్యక్తులు ఎంపీలుగా గెలవడం విశేషం. జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ ఈ ఎన్నికల్లో 27 సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. వీరి మద్దతుతోనే ట్రూడో కొత్తప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. మాజీ మంత్రులు టిమ్ ఉపల్, హర్జిత్ సింగ్ సజ్జన్, బర్దిశ్ చాగర్, అనితా ఆనంద్ లు మరోసారి ఎంపీలుగా గెలిచారు.

17 Members Indo Canadians Won In Canada Elections
17 Members Indo Canadians Won In Canada Elections

వాంకోవర్ నుంచి రక్షణ శాఖ మంత్రి హర్జిత్ సింగ్ రెండోసారి గెలవడం విశేషం. వాటర్లూ సీటు నుంచి ఛాగర్, కొలంబియా నుంచి సుఖ్ దల్వాల్, సర్రీ సెంటర్ నుంచి రణ్ దీప్ సింగ్ సారాయి, క్యుబెక్ నుంచి ఇండో కెనడియన్ అంజూ థిల్లాన్, కాల్గరి ఫారెస్ట్ లాన్ స్థానం నుంచి జస్ రాజ్ సింగ్ హల్లన్, ఎడ్మంటన్ మిల్ వుడ్స్ నుంచి ఉపల్ రెండోసారి విజయం సాధించారు. కాగా ఒంటారియాలో నలుగురు సిట్టింగ్ ఇండో కెనడియన్లు మరోసారి గెలిచారు. ఎంపీలు మణిందర్ సిద్ధూ, రూబీ సహోటా, సోనియా సిద్దు, కమల్ ఖేరా, చంద్ర ఆర్యా కెనడా ఎన్నికల్లో గెలిచిన భారత సంతతి కెనడియన్లు. ఖండాతరాలు దాటి భారతదేశం పేరు మార్మోగిస్తున్న వీరికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి.