తెలంగాణలో కొత్తగా 1,707 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,24,066 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,707  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ (158), ఖమ్మం (124), నల్లగొండ(147)లో కొత్త కేసులు నమోదు అయ్యాయి.

రాష్ట్రంలో నిన్న కరోనాతో 16 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,456కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,493 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,759 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.