రాష్ట్రంలో కొత్త‌గా 1,798 క‌రోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం పడుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,798 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 14 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 174, ఖమ్మం 165, నల్లగొండ 151, రంగారెడ్డి 107 కేసులు నమోదయ్యాయి.

తాజాగా 2,524 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 23,561 యాక్టివ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 1,30,430 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించినట్టు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.