18 కోట్ల మంది పీఎన్‌బీ ఖాతాదారుల డేటా బహిర్గతం..!

Punjab-National-Bank

పంజాబ్‌ నేనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)కు చెందిన 18 కోట్ల మంది ఖాతాదారులకు సంబంధించిన సమాచారం బహిర్గతం అయినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

సర్వర్ లో లోపం 

ఏడు నెలలుగా పీఎన్‌బీ ఖాతాదారుల సమాచారం బహిర్గతంగా ఉన్నట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సైబర్‌ ఎక్స్‌9 తెలిపింది. బ్యాంక్‌కు సంబంధించిన డిజిటల్‌ బ్యాంకింగ్‌కు వ్యవస్థ మొత్తాన్ని యాక్సెస్‌ చేసే అవకాశాన్ని సర్వర్‌లోని లోపం కల్పించిందని ఆ సంస్థ వెల్లడించడం పీఎన్బీ వర్గాల్లో కలకలం రేపింది.

డేటా భద్రం

అయితే సర్వర్‌లో టెక్నికల్ సమస్య వచ్చిన విషయం నిజమే అయినప్పటికీ.. ఖాతాదారులకు సంబంధించి ఎలాంటి సమాచారం బహిర్గతం కాలేదని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ చెప్పింది. ఆన్‌-ప్రిమ్‌ నుంచి ఆఫీస్‌ 365 క్లౌడ్‌లోకి ఈ-మెయిల్స్‌ను రూట్‌ చేయడానికి మాత్రమే ఆ సర్వర్‌ను వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. ముందస్తు చర్యల్లో భాగంగా సర్వర్‌ను షట్‌డౌన్‌ చేసినట్లు బ్యాంక్ తెలిపింది.