ఎదురెదురుగా వచ్చిన ఇండిగో ఫ్లైట్స్​.. త్రుటిలో త‌ప్పిన ప్ర‌మాదం

2 IndiGo planes avert mid-air collision over Bengaluru airport; DGCA orders probe

రెండు ఇండిగో విమానాలు ఆకాశంలోకి ఎగిరిన కొద్ది సమయానికే అతి దగ్గరగా వచ్చాయి. అయితే, రాడార్​ వ్యవస్థ హెచ్చరించటం వల్ల త్రుటిలో ప్రమాదం తప్పింది. బెంగళూరు విమానాశ్రయంలో ఈ సంఘటన జనవరి 9న జరిగినట్లు విమానాయన నియంత్రణ సంస్థ డీజీసీఏ బుధవారం తెలిపింది. కానీ, ఈ దీని గురించి లాగ్​బుక్​లో ఏమీ నమోదు చేయలేదని, ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఏఏఐ)కి నివేదించలేదని పేర్కొంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని, తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు డీజీసీఏ చీఫ్​ అరుణ్​ కుమార్​. మరోవైపు.. ఈ సంఘటనపై ఇండిగో, ఏఏఐ స్పందించేందుకు నిరాకరించాయి.