రోడ్డుపై కుప్పలు, కుప్పలుగా రెండు వేల రూపాయల నోట్లు. షాహిద్ కపూర్ వేనా!

రోడ్డుపై వెళ్తుంటే 2 వేల రూపాయల నోటు ఒక్కటి కనిపిస్తేనే ఫుల్ ఖుషీ అయిపోయి ఆ నోటును జేబులో వేసుకుంటాం. అలాంటిది కుప్పలు తెప్పలుగా 2 వేల నోట్ల వర్షం రోడ్డుపై కురిస్తే! ఆ ప్లేస్ లో ఉన్న వారికి ఆ రోజు పండుగే. వీలైనన్నీ నోట్లను తమ సొంతం చేసుకోవాలనుకుంటారు. సరిగ్గా ముంబైలోని ఓ ప్రాంతంలో ఇలాగే 2 వేల నోట్ల వర్షం కురిసింది. దీంతో జనం పరుగెత్తుకొచ్చి వాటిని ఏరుకున్నారు. కానీ వారి ఆశ ఎంతో సేపు నిలవలేదు. ఎందుకంటే అవన్నీ వర్జినల్ నోట్లు కాదు. అన్ని నకిలి నోట్లనే అలా రోడ్డుపై వేశారు.

షాహిద్ కఫూర్ పై ఆగ్రహం

ఐతే ఈ నోట్లన్నీ నకిలీవని తేలటంతో జనమంతా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి షాహిద్ కు ఏమీ సంబంధం అనుకుంటున్నారా? ఉంది. ఈ నకిలీ నోట్లన్నీ షాహిద్ కఫూర్ నటిస్తున్న వెబ్ సిరీస్ ‘సన్నీ’ షూటింగ్‌ కోసం ఉపయోగించినవే. ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌లో భాగంగా ఓ యాక్సిడెంట్‌ సీన్ ఉంది. ఆ సమయంలో మొత్తం రెండు వేల నోట్లు రోడ్డుపై పడిపోవాలి. అలా ఆ సీన్ కోసం నకిలీ నోట్లను వాడారు. కానీ షూటింగ్ అయిపోయాక వాటిని అలాగే రోడ్డుపై వదిలేసి వెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలోని జనం నకిలీ నోట్లన్నీ అసలైనవేననుకొని ఏరుకునేందుకు ఎగబడ్డారు. ఆ తర్వాత నకిలీ నోట్లన్న అసలు విషయం తెలుసుకొని కోపానికి వచ్చారు. షాహిద్ కఫూర్ ను కూడా తిట్టుకున్నారు.

మూవీ టీమ్ పై కంప్లైంట్

ఐతే గాంధీ ఫోటో ఉన్న నోట్లను రోడ్డుపై పారేసినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని మూవీ టీమ్ పై కొంతమంది ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ విషయం పై విచారణ జరిపిస్తామని చెప్పారు. మూవీ టీమ్ మాత్రం నకిలీ నోట్లను రోడ్డుపై నుంచి తొలగించామని చెబుతున్నారు.