హుజారాబాద్ ఉపఎన్నికలకు 20 కంపెనీల కేంద్ర బలగాలు

20 companies military will OnDuty In Huzurabad Election
20 companies military will OnDuty In Huzurabad Election

హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్ కి 20 కంపెనీల కేంద్ర బలగాలు దిగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఇప్పటికే హుజురాబాద్ కు మూడు కంపెనీల బలగాలు చేరుకున్నాయి. కాగా.. మరో రెండు రోజుల్లో మిగతా 17 కంపెనీల బలగాలు హుజురాబాద్ కు చేరుకుంటాయని ఆయన తెలిపారు.

20 companies military will OnDuty In Huzurabad Election
20 companies military will OnDuty In Huzurabad Election

హుజూరాబాద్‌లో ఇప్పటివరకు రూ.1.80 కోట్ల నగదు, రూ.6.11 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎన్నికల కమిషన్ హుజురాబాద్ ఉపఎన్నికకు ప్రత్యేకంగా ప్రత్యేక వ్యయ పరిశీలకుడిని నియమించిందని చెప్పారు. నియోజకవర్గంలో 97.6 శాతం ఓటర్లు ఇప్పటివరకు మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారని, 59.9 శాతం ఓటర్లకు రెండో డోస్‌ పూర్తయిందని ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి దాదాపు వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి అయిందని వెల్లడించారు.