రాష్ట్రంలో కొత్తగా 208 కరోనా కేసులు

carona-virus

రాష్ట్రంలో గత 24 గంటల్లో 45,418 పరీక్షలు నిర్వహించగా.. 208 కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ బారినపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,929 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ చెప్పింది. ఒక్కరోజు వ్యవధిలో 201 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 62 కొత్త కేసులు నమోదు అయ్యాయి.