ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్ కేసులో సంచలన మలుపు.. బెయిల్ కోసం 25కోట్లా.. అడ్డంగా దొరికిపోయారు.. రంగంలోకి ఎన్‌సీబీ..!

25 crore deal to let off Aryan Khan from drugs case
25 crore deal to let off Aryan Khan from drugs case
25 crore deal to let off Aryan Khan from drugs case
25 crore deal to let off Aryan Khan from drugs case

ముంబై క్రూయిజ్‌ డ్రగ్‌ కేసులో అరెస్టై ముంబై ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఉన్న షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్ రోజుకొక మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ డ్రగ్స్ కేసులో దిమ్మతిరిగే వార్త ఒకటి బీ టౌన్ లో హల్చల్ చేస్తుంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ చేస్తున్న దర్యాప్తు అధికారులు ఆర్యన్ ఖాన్ ని కేసు నుండి తప్పించడానికి షారుఖ్ ఖాన్ ని భారీ ఎత్తున డబ్బులు అడిగినట్టు రూమర్స్ వస్తున్నాయి. డ్రగ్స్ కేసు విచారిస్తున్న జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే షారుఖ్ దెగ్గర బెయిల్ కోసం 25కోట్ల వరకు డబ్బులు డిమాండ్ చేసినట్టు వార్తలు రావటంతో.. ఎన్‌సీబీ ఈ ఆరోపణలని సీరియస్ గా తీసుకుంది. దీంతో డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలో సమీర్ వాంఖడేపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టారు. కాగా, డ్రగ్స్ కేసు విచారణ నుంచి సమీర్ వాంఖడే నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది. ఇక కొడుకు అరెస్ట్ తరువాత తొలిసారి షారుఖ్ ఖాన్ వెళ్లి ఆర్యన్ ని కలవటం జరిగింది. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్ బెయిల్ తిరసరించగా మరోసారి బెయిల్ కోసం పెద్దఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొడుకుని విడిపించడానికి షారుఖ్ చేయాల్సిన ప్రయత్నాల్ని చేస్తున్నాడు. ఇందులో భాగంగానే షారుఖ్ నుండి భారీఎత్తున డబ్బుల డిమాండ్స్ చేశారనిఆరోపణలు రావటం నేషినల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.