ఎన్టీఆర్ అభిమానులు నన్ను చంపేసేవాళ్ళు.. హరికృష్ణ కారణంగా.. పృథ్వీ షాకింగ్ కామెంట్స్..!

30 Years Industry Prudhvi Shocking Comments About Ntr Fans And Harikrishna
30 Years Industry Prudhvi Shocking Comments About Ntr Fans And Harikrishna

30ఇయర్స్ పృథ్వీ ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటాడు. నటుడిగా, కమెడియన్ గా ఎంత పేరు సంపాదించాడో కాంట్రవర్షియల్ కామెంట్స్ తోను అంతే క్రేజ్ దక్కించుకున్నాడు. రాజకీయాల్లో 30ఇయర్స్ పృథ్వీ ప్రసంగాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా వైసీపీలో ఉన్న ఈయన గత కొన్ని నెలలుగా అనుకోని వివాదాలలో ఉన్నాడు. ఈ మధ్య పాలిటిక్స్ కి కాస్త దూరమైన పృథ్వీ సినిమాలపైనే తన ఫోకస్ పెట్టాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూ కి హాజరైన పృథ్వీరాజ్ తన కెరీర్‌లో జరిగిన ఓ సంఘటన గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు. కెరీర్ మొదట్లో సీనియర్ ఎన్టీఆర్ పై తీసిన సెటైరికల్ మూవీ గండిపేట రహస్యం చేసినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కారణంగా నా ప్రాణాలు పోయేవని.. కానీ హరికృష్ణ కారణంగానే నేను బ్రతికి బయటపడ్డానని షాకింగ్ కామెంట్స్ చేశాడు 30ఇయర్స్ పృథ్వీ.

నటుడు, నిర్మాత ప్రభాకర్ రెడ్డి తెరకెక్కించిన గండిపేట రహస్యం చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పోషించాడు పృథ్వీ. సీనియర్ ఎన్టీఆర్ పై ఎన్నో విమర్శలకు కేంద్ర బిందువుగా మారిన గండిపేట రహస్యం విడుదల తరువాత.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ మూవీ టీమ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ వారిపై దాడులు చేయడానికి పూనుకున్నారు. ఈ క్రమంలో ఒక థియేటర్ కు పృథ్వీరాజ్, ప్రభాకర్ రెడ్డి కలిసి వచ్చారు. వాళ్లు వచ్చారన్న విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు వాళ్ల‌పైకి దాడి చేయడానికి పరుగులు పెట్టారు. అయితే అక్కడే ఉన్న నందమూరి హరికృష్ణ తన కారులో పృథ్వీరాజ్, ప్రభాకర్ రెడ్డిని ఎక్కించుకుని వేరే దగ్గరికి తీసుకెళ్లి కాపాడాడు. ఈ విషయాన్నీ స్వయంగా పృథ్వీనే చెప్పాడు. ఆ సమయంలో హరికృష్ణ గారు లేకపోయింటే నన్ను నందమూరి అభిమానులు చంపేసేవారని ఆనాటి చేదు జ్ఞాపకాలని గుర్తుచేకున్నాడు 30ఇయర్స్ పృథ్వీ. అయితే గండిపేట రహస్యం సినిమా విడుదలైన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ దీన్ని సీరియస్‌గా తీసుకోలేదని.. పైగా నువ్వు మంచి నటుడిని అవుతావని పెద్దాయన ఆశీర్వదించిన విషయాన్ని కూడా చెప్పాడు పృథ్వీ. ఏదేమైనా 30ఇయర్స్ పృథ్వీ ఇప్పుడే కాదు కెరీర్ మొదట్లో కూడా కాంట్రవర్సీల్లో చిక్కుకోవటం గమనార్హం.