రాష్ట్రంలో కొత్తగా 3,557 కరోనా కేసులు, ముగ్గురు మృతి

3557 new corona cases , 3 deaths in telangan state,

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,11,178 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,557 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,18,196కు చేరాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

తాజాగా రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,065కు చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 1,773 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 6,89,878 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,253 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా 1,474 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రెటు 0.57 శాతం కాగా… రికవరీ రేటు 96.06 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో ఇవాళ 2,71,165 మందికి కొవిడ్‌ టీకా డోసులు ఇచ్చారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 5.12 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్టయింది.