రాష్ట్రంలో కొత్తగా 3,944 కరోనా కేసులు

రాష్ట్రంలో ఇవ్వాళ కొత్తగా మరో 3,944 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 97, 549 శాంపిల్స్ ను టెస్ట్ చేయగా 3, 944 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,51,099కి పెరిగింది. గత 24 గంటల్లో 2,444 మంది నుంచి కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 7,07,498 కి చేరింది. రికవరీ రేటు 94.20 శాతంగా ఉంది. అటు జీహెచ్ఎంసీ పరిధిలో 1372 కేసులు నమోదయ్యాయి.