రాష్ట్రంలో కొత్తగా 4,393 కరోనా కేసులు

carona testing

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,16,224 నమూనాలను పరీక్షించగా.. 4,393 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,643 కొత్త కేసులు వచ్చాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,31,212కి చేరింది. తాజాగా 2,319 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో రికవరీ రేటు 95.18శాతంగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది.