ఏపీలో కొత్తగా 4,528 కరోనా కేసులు

carona cases

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా నాలుగువేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

గడచిన 24 గంటల్లో 39,816 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 4,528 కరోనా కేసులు నమోదయ్యాయి.

కొవిడ్‌ కారణంగా నిన్న ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 418 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 18,313 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది.