తైవాన్ లో భారీ అగ్నిప్రమాదం.. 46మంది అగ్నికి ఆహుతి - TNews Telugu

తైవాన్ లో భారీ అగ్నిప్రమాదం.. 46మంది అగ్నికి ఆహుతితూర్పు ఆసియా దేశమైన తైవాన్ లో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకొని 46మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 55 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. 13 అంతస్తుల నివాస సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు చెలరేగిన మంటల వల్ల భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

46 members loss thier lives in thaiwan fire accident
46 members loss thier lives in thaiwan fire accident

మంటల వల్ల భవన శిథిలాల్లో చిక్కుకుపోయిన వారి కోసం అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భవనంలోని కింది అంతస్తులో చెలరేగిన మంటలు క్రమంగా బిల్డింగ్ మొత్తం విస్తరించాయి. 40 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ బిల్డింగ్ పై అంతస్తులు నివాసాలు కాగా.. కింది అంతస్తుల్లో దుకాణ సముదాయాలు ఉన్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.