కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి… కొత్తగా 494 కేసులు

covid test

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 28,865 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 494 మందికి పాజిటివ్‌గా తేలింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 315 కేసులు నమోదు కావడం గమనార్హం. కొవిడ్‌ బారి నుంచి ఇవాళ 126 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,048 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.