జమ్మూకశ్మీరులో టెంపో ట్రాలీ లోయలో పడి ఐదుగురు మృతి

tempo traveller

ఓ టెంపో ట్రాలీ లోయలో పడి ఐదుగురు చనిపోయిన విషాద ఘటన జమ్మూకశ్మీరులోని రాంబన్ జిల్లాలో  జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. మరో 12 మంది గాయపడ్డారు. రాంబన్ జిల్లాలో జమ్మూ నుంచి బనీహాల్ కు టెంపో ట్రాలీలో వెళుతుండగా ప్రమాదవశాత్తూ లోయలో పడింది. లోయలో పడే ముందు టెంపో ఓ కారును ఢీకొందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసలు…కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.