వైద్యారోగ్య శాఖలో 50 వేల పోస్టులు.. జీతభత్యాలు.. దరఖాస్తు విధానం - TNews Telugu

వైద్యారోగ్య శాఖలో 50 వేల పోస్టులు.. జీతభత్యాలు.. దరఖాస్తు విధానం



తెలంగాణలో క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా తాత్కాలికంగా 50 వేల మంది డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియ‌మించాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించిన విష‌యం తెలిసిందే. తాజాగా వైద్యారోగ్య శాఖలో తాత్కాలిక నియామ‌కాల‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది.

అర్హులైన డాక్టర్లు, వైద్య సిబ్బందికి ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తూ వైద్యారోగ్య శాఖ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

అర్హులైన వారు ఈ నెల 22వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. స్పెష‌లిస్ట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌కు నెల‌కు రూ. ల‌క్ష వేత‌నం, ఎంబీబీఎస్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌కు నెల‌కు రూ. 40 వేల వేత‌నం, ఆయుష్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌కు నెల‌కు రూ. 36 వేలు వేత‌నం చెల్లించనున్నారు.

https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx లింక్ ద్వారా డాక్టర్లతో పాటు రాష్ట్రంలో అర్హతవున్న నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది అప్లై చేసుకోవచ్చు.