రూ.500 కోట్ల విలువైన శివలింగం స్వాధీనం

500 crore worth Shivalingam seized

తమిళనాడులోని తంజావూరులో వెయ్యేళ్ల నాటి అరుదైన శివలింగాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.500 కోట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.

చోళ రాజుల కాలానికి చెందిన అరుదైన మరకత శివలింగాన్ని తమిళనాడు అక్రమ రవాణా నిరోధక అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చోళుల రాజధాని అయిన తంజావూరులో ఈ లింగాన్ని అధికారులు గుర్తించారు.

అరులానంద ఏరియాలోఉండే సామియాపన్ దగ్గర విలువైన శివలింగాలు ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అధికారులు డిసెంబర్ 30న సామియాపన్ ఇంట్లో సోదాలు నిర్వహించి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ శివలింగాన్ని ముసుకుంత చోళ రాజు దానం చేశారని నిపుణులు చెబుతున్నారు. తంజావూరుతో పాటు తిరుకువలై, తిరుక్కారవసల్, తిరునల్లార్, నాగపట్టిణం, వేదారణ్యం, తిరువరూర్ ప్రాంతాల్లోని శివాలయాల్లో మరకత లింగాలు దర్శనమిస్తాయి.