ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జిల్లాలోని ఓ ఇంటిలో ఒకట్రెండు కాదు.. ఏకంగా 60 పాములు బయటపడ్డాయి. ఈ పాములను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
తొలుత ఇంటి ఆవరణలో రెండు పాములు కన్పించాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి యజమానికి విషయం చెప్పడంతో.. ఈ క్రమంలో పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు.
పాములు బాత్రూమ్ ఫ్లోర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. బాత్రూమ్ ఫ్లోర్ తీసి చూడగా.. 60 పాములు బయటపడ్డాయి. మొత్తం 75 గుడ్లు పగిలిపోయి ఉన్నాయి. ఈ పాములన్నింటినీ పట్టుకొని సమీప అడవిలో వదిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.