పెరూలో 7.5 తీవ్రతతో భారీ భూకంపం

earthquake

పెరూ దేశంలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.5తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) తెలిపింది.

బరాన్కాకు ఉత్తరాన 36 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. భూంకంపం ధాటికి జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టగా.. భవనాలు ఊగిపోయాయి.

భూమికి వంద కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని యూరో-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ట్వీట్‌లో తెలిపింది.

భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ఇప్పటి వరకు భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.