ఆవును పెండ్లాడిన 74 ఏండ్ల వృద్ధురాలు

woman-married-a-cow

మన దేశంతో పాటు విదేశాల్లోనూ ఎన్నో నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. కంబోడియాలో ఒక 74 ఏళ్ల వృద్ధురాలు చనిపోయిన తన భర్తే మళ్లీ తిరిగొచ్చాడంటూ ఒక ఆవును పెండ్లాడి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కంబోడియాలోని క్రతి ప్రావిన్స్ కు చెందిన ఖిమ్ హాంగ్(74) కు ఇద్దరు పిల్లలు. కొన్నేండ్ల క్రితమే ఆమె భర్త అనారోగ్యంతో కన్నుమూశాడు. భర్త పోయాక ఇంట్లో ఉన్న ఆవుతోనే  ఎక్కువ సమయం గడిపేది. ఈ క్రమంలో దాన్ని ప్రేమగా చూసుకునేది.

ఆవు సైతం ఖిమ్ దగ్గరికి రాగానే చేతిని, నుదిటిని నాలుకతో నాకేది. దీంతో తన భర్తే ఆవు రూపంలో మళ్లీ పుట్టాడని, అందుకే తనపై ఇంత ప్రేమ చూపిస్తోందని నమ్మింది. ఆవుతో మళ్లీ ప్రేమలో పడ్డ ఖిమ్ హాంగ్.. ఆవుతో కలిసి పెళ్లిపీటలెక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది.

woman-married-a-cow-1

 

అయితే ఆ మహిళ ఆవును పెళ్లి చేసుకుందనడానికి వీడియో గానీ.. ఫొటో ఆధారాలు గానీ లేవు. కానీ స్థానికులు మాత్రం వారిద్దరు పెళ్లి చేసుకున్నారని, తమ సమక్షంలోనే ఆ పెళ్లి తంతు జరిగిందని చెబుతున్నారు.

ప్రస్తుతం ఆవుకు కూడా తన ఇంట్లో స్థానం కల్పించింది. ఆవుతోపాటే పడుకుంటుంది. ఆవు పడుకునేందుకు వీలుగా దిండు, పరుపు కూడా ఇస్తుంది. ఒకవేళ తాను చనిపోతే ఆవును నిర్లక్ష్యం చేయకుండా కన్నతండ్రిలా చూసుకోవాలని పిల్లలకు ఖిమ్‌ చెబుతోంది. ఆవు చనిపోతే.. మనుషులకు జరిపినట్లుగానే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ఇప్పటి నుంచే కొడుకులకు చెబుతోందట.