నిజామాబాద్‌ జిల్లాలో ప్రేమజంట ఆత్మ‌హ‌త్య.. కుళ్లిన స్థితిలో మృత‌దేహాలు

A couple committed suicide in Nizamabad district

నిజామాబాద్ జిల్లాలో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య క‌ల‌క‌లం రేపింది చందూర్ మండలం లక్ష్మాపూర్‌ గ్రామ సమీపంలోని అట‌వీ ప్రాంతంలో గురువారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ చెట్టుకు ఉరేసుకొని వేలాడుతున్న యువతీ యువకుడి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. మృత‌దేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండ‌డంతో వారం రోజుల క్రిత‌మే వారు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డి ఉండొచ్చని భావిస్తున్నారు. గ్రామ‌స్తుల స‌మాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులను మోస్రా మండలం తిమ్మాపూర్‌కు చెందిన మోహన్‌, లక్ష్మిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.