సర్వోన్నత న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు ఘనమైన స్వాగతం

 

భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ త హైదరాబాద్ కు తొలిసారిగా విచ్చేశారు. రాష్ట్ర హైకోర్టులో 24 మంది ఉన్న జడ్జీల సంఖ్యను 42 కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు ఎన్వీ రమణకు తెలంగాణ ప్రజాప్రతినిధులు జస్టిస్ ఎన్వీ రమణకు ధన్యవాదాలు తెలియజేశారు. రెండేళ్లుగా పెండింగులో ఉన్న హైకోర్టులో జడ్జీల సంఖ్య పెంపు అంశాన్ని కొలిక్కి రావడం పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు.

శుక్రవారం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు  రాష్ట్ర  ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అటవీ శాఖ,దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాష్ట్ర రాజ్యసభ సభ్యులు కేశవరావు, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ, డిజిపి ఎం మహేందర్ రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరెకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, జయ్ పాల్ యాదవ్, అంజయ్య యాదవ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమినర్ సజ్జనార్ తదితరులు ఘన స్వాగతం పలికారు.