భారీ గ్రహ శకలాలు దూసుకొస్తున్నాయ్.. జస్ట్ 19 సెకన్లలోనే.. టెన్షన్ లో ఖగోళ శాస్త్రవేత్తలు

అంతరిక్షంలో ఏం జరిగినా ప్రపంచమంతా ఆసక్తిగా.. ఆందోళనగా చూస్తుంది. ఎందుకంటే వింత జరిగితే ఆకాశంలో అద్భుతాలు చూడొచ్చు. కానీ.. వినాశనం సంభవిస్తే మాత్రం అంతా బూడిదే. అవును.. ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి ప్రపంచాన్ని కలవరపెడుతున్నది. ఖగోళ శాస్త్రవేత్తలంతా దాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. అసలు అంతరిక్షంలో ఏం జరుగుతోంది? భూమిని ముంచెత్తనున్న ఆ ఉపద్రవం ఏంటి? అది ప్రమాదామా? తప్పించుకునే మార్గం లేదా? ఈ స్టోరీ చదివితే మీకే తెలుస్తుంది.

Comet passing in front of planet earth

ఓ భారీ గ్రహ శకలం.. అంతరిక్షం నుంచి భూమి వైపే వేగంగా దూసుకొస్తోంది. చాలా పెద్దది. చూసేందుకు భూమి కంటే పెద్దగానే ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అది నేరుగా వచ్చి భూమిని ఢీకొడితే ఏంటి పరిస్థితి. అంత బూడిదేనా? సర్వం వినాశనమేనా? భూమికి ప్రమాదం ముంచి ఉందా? అంటే అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ విషయాన్నే పరిశోధిస్తోంది.

ఆసక్తిగా చూస్తున్న నాసా..
భూమివైపు గ్రహ శకలాలు తరచూ వచ్చిపోవడం సహజమే. చాలా కామన్ గా వస్తుంటాయ్.. పోతుంటాయి. కానీ.. ఈ సారి వచ్చే గ్రహశకలం మాత్రం మామూలుది కాదు. చాలా పెద్దది. భూమి వైపు చాలా వేగంగా దూసుకొస్తోంది. దాని పేరే 2016 జేజీ12. దాని సైజు 623. నాసా శాస్త్రవేత్తలు దీన్ని 2106 మే 3న కనిపెట్టారు. భూమివైపు దూసుకొస్తున్న ఈ గ్రహ శకలాన్ని చూసి అప్పట్లో చందమామలాంటి మరో గ్రహం అనుకున్నారు. కానీ.. కాదు. అదో గ్రహశకలం. భారీ సైజులో.. చాలా స్పీడ్ గా దూసుకొస్తున్న ఓ గ్రహం నుంచి రాలిపడిన శకలం. అయితే.. అది భూమిని సమీపిస్తుండటమే ఇప్పుడు అందరినీ కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటికే నాసా దీనిపై కన్ను వేసింది.

ఢీ కొడుతాాయా?
ఇప్పుడు ఆ భారీ గ్రహశకలం భూమికి 59 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏంటీ.. ఓ… చాలా దూరంలో ఉందిలే అనుకుంటున్నారా? ఆ దూరాన్ని చేరడానికి దానికి పట్టే సమయం జస్ట్ 19 సెకన్లు మాత్రమే. అయితే గ్రహాలు తిరిగినట్టు గ్రహ శకలాలు ఒకే కక్ష్యలో తిరగవు. అడ్డదిడ్డంగా.. ఎటు పడితే అటు లక్షల మైళ్ల వేగంతో దూసుకొస్తుంటాయి. వాటి దారిలో ఏదైనా అడ్డుగా బ్లైండ్ గా ఢీకొట్టేస్తాయి. ఈ గ్రహ శకలం కూడా అంతే. చాలా స్పీడుగా భూమివైపు దూసుకొస్తోంది. ఈ నవంబర్ 20 అంటే.. ఈ శనివారం నాడు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత 23 సెకన్లకు అది భూమికి అతి దగ్గరగా వస్తుంది. ఈ పరిణామాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ఇంట్రెస్టుగా గమనిస్తున్నారు.

ఎంత స్పీడ్ గా వస్తుందంటే..
ప్రస్తుతం ఈ గ్రహ శకలం సెకనుకు 7 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. అంటే.. హైదరాబాద్ నుంచి విశాఖ పట్నానికి జస్ట్ 87 సెకన్లు అంటే.. ఒకటిన్నర నిమిషంలో వచ్చేస్తుంది. అంటే 613 కిలోమీటర్లను 87 సెకన్లలో దాటేస్తుందంటే ఎంత వేగంగా వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు రెండింటి మధ్య దూరం 55.2 లక్షల కిలోమీటర్లుగా చూపిస్తోంది. కానీ.. నిజంగా అంత దగ్గరగా వచ్చి ఆగిపోతుందా.. భూమిని ఢీకొడుతుందా అని శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఇప్పుడు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాని.. మళ్లీ 2024 నవంబర్ 3న మరోసారి భూమి వైపు దూసుకు వస్తుంది. ఒకవేళ ఇప్పుడు మిస్ అయినా.. అప్పుడు భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉందంటున్నారు ఖగోళవేత్తలు.


మరో గ్రహశకలం సిద్ధంగా ఉందా

2016 జేజీ12 నుంచి తప్పించుకున్నా.. ఆ వెంటనే మరో గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తుంది. అది కూడా మరుసటి రోజే అంటే.. నవంబర్ 21 నాడే. అది కూడా భూమికి 57 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని పేరు 1983 హెచ్ఆర్ 3361 ఆర్ఫియస్. ఈ గ్రహశకలాన్ని 1982వ సంవత్సరంలో కనిపెట్టారు. ఆ మధ్యకాలంలో ఓ భారీ గ్రహశకలం దాదాపు ఈఫిల్ టవర్ అంత సైజ్ ఉన్న శకలం భూమి వైపు దూసుకొచ్చింది. దాని పేరు 2004 యూఈ. కానీ.. దాని వల్ల భూగ్రహానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే.. ఖగోళంలో మొత్తం అలాంటి గ్రహాలు 8 ఉన్నాయి. అవి తరచూ భూమికి దగ్గరగా వచ్చి వెళ్తున్నాయి. ఇప్పటి వరకు వాటి వల్ల భూమికి ఏ ప్రమాదం జరగకపోయినా.. ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


గ్రహ శకలాల వల్లే వైరస్ లా?
భూగ్రహాన్ని ఏదైనా గ్రహశకలమో, తోకచుక్కనో ఢీకొట్టడం వల్లనే జీవరాశి ఏర్పడిందనేది ఓ అంచనా. దాని నుంచి వచ్చిన నీరు, జీవరాశే భూమిపై పెరిగి పెద్దదైందని భావిస్తారు శాస్త్రవేత్తలు. అయితే.. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితిని గమనిస్తే.. కొత్త కొత్త వైరస్ లు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. అయితే.. ఈ వైరస్ లు భూమ్మీదకు ప్రవేశించడానికి గ్రహ శకలాలే కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. గ్రహశకలాలు భూమికి దగ్గరగా రావడం వల్లే వాటి మీద కొత్త జీవరాశి భూమిపై ప్రవేశించి ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని భావిస్తున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.