గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఖాజ టోల్‌ప్లాజా వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లారీని క్యాష్ కౌంటర్ వద్ద ఆపి టోల్ రుసుము చెల్లిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే మంటలు క్యాష్కౌంటర్లకు వ్యాపించాయి.
అప్రమత్తమైన టోల్‌ప్లాజా సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రెండు క్యాష్ కౌంటర్లు పూర్తిగా దగ్ధ మయ్యాయి. ప్రస్తుతం టోల్‌ప్లాజా నుంచి యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి.