జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం

జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఆనంద్ షాపింగ్ మాల్ లో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు గమనించి మాల్ ఓనర్ కి చెప్పడంతో ఆయన వెంటనే ఘటనాస్థలికి వచ్చి.. అగ్ని మాపక అధికారులకు సమాచారం అందించారు.

రెండు అగ్నిమాపక వాహనాలతో ఫైర్ డిపార్టుమెంట్ వారు అక్కడికి వచ్చేసరికే కింది అంతస్తు పూర్తిగా పూర్తిగా కాలిపోయింది.  చూస్తుండగానే నాలుగు అంతస్తుల్లోకి మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసిపడడంతో స్థానికులు తీవ్ర భయాందోళకు గురయ్యారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రమాద కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.