విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

huge fire broke out

విజయనగరం జిల్లా మెంటాడ మండలం బక్కులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో కూరకుల వీధిలో 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇండ్లలో గ్యాస్ సిలిండర్లు పేలుతుండటంతో సమీప నివాసాలకు మంటలు వ్యాపిస్తున్నాయి.

మంటలు భారీగా ఎగిసిపడడంతో గ్రామస్థులు భయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టాలపై సమాచారం అందాల్సి ఉంది.