లతా మంగేష్కర్‌ ఆరోగ్య పరిస్థితిపై కీలక ప్రకటన

Lata Mangeshkar

గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అధికార ప్రతినిధి కీలక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

అయితే లతా మంగేష్కర్‌ ఆరోగ్యం క్షీణించిందటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె అధికార ప్రతినిధి ఖండించారు. ఈ వదంతులను నమ్మవద్దంటూ క్లారిటీ ఇచ్చారు.

లతా దీదీ ఇంకా ఐసీయూలోనే ఉన్నారని, డాక్టర్‌ ప్రతీత్‌ సందానీ బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దంటూ విఙ్ఞప్తి చేశారు. లతా మంగేష్కర్‌ కుటుంబానికి, డాక్టర్లకు ప్రైవసీ ఇవ్వాలని ఆయన కోరారు.