విషం తాగి పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రేమజంట

suicide4

వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలంలో దారుణం జరిగింది. చన్గోముల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసు స్టేషన్ సమీపంలోని ఓ ఫాం హౌస్ వద్ద ప్రేమజంట కలుపు మందు సేవించి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. వీరిని గుర్తించిన పోలీసులు వెంటనే ఇద్దరిని వికారాబాద్‌లోని మిషన్ ఆస్పత్రికి తరలించారు. గత శనివారం ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్ళిపోయిన ఇద్దరు… నిన్న రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంట్లో మందలిస్తారని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.