పాతబస్తీలో మైనర్ బాలుడిపై కాల్పులు

హైదరాబాద్: పాతబస్తీ సుల్తాన్ షాహీలో మైనర్ బాలుడిపై కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాలుడు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగల్ ఫురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్ షాహిలో నివసించే అఫ్సర్.. మూడేళ్ళ క్రితం అబిడ్స్ లో ఎయిర్ గన్ కొన్నాడు. అఫ్సర్ ఎయిర్ గన్ తో కుక్కలపై ఫైరింగ్ చేస్తుంటాడు. ఇదే క్రమంలో ఈ నెల 1న ఇంట్లో ఉన్న బల్లులను ఎయిర్ గన్ తో షూట్ చేస్తుండగా మిస్ ఫైర్ అయి బాలుడికి గాయాలు అయినట్లు మొగల్ ఫురా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.