ఎమ్మెల్సీ కవితకు అరుదైన గిఫ్ట్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు ఓ అభిమానాన్ని అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు. నిజామాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు పబ్బ సాయిప్రసాద్‌ ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పాలని అనుకున్నాడు.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో 60 అడుగుల భారీ చిత్రం వేయించాడు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శైలేష్‌ కులకర్ణి కి బాధ్యతలు అప్పగించాడు. ఎమ్మెల్సీ కవిత చిత్రాన్ని పూర్తిచేయడానికి శైలేష్‌ కులకర్ణి ఆధ్వర్యంలోని కళాకారులు 20 గంటలకుపైగా శ్రమించారు.