ఛోటా చాంపియన్.. అచ్చం మీరాబాయి చాను లాగే : వీడియో వైరల్ - TNews Telugu

ఛోటా చాంపియన్.. అచ్చం మీరాబాయి చాను లాగే : వీడియో వైరల్టోక్యో ఒలింపిక్స్‌లో శుభారంభం చేసిన మీరాబాయి చాను 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ లో భారత్‌కు రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. వెయిట్‌లిఫ్టింగ్‌ మహిళల విభాగంలో కరణం మల్లీశ్వరీ తర్వాత.. ప్రపంచ స్ధాయిలో పతకం సాధించిన రెండో మహిళగా మీరాబాయి రికార్డుకెక్కారు. ఒలింపిక్స్‌ లో భారత్ కు పతకాల ఖాతా తెరిచిన ఆమె పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. తాజాగా స్వదేశానికి చేరుకున్న మీరాబాయికి ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో మీరాబాయి చానును అనుకరిస్తూ వెయిట్‌లిఫ్టర్‌ సతీష్‌ శివలింగం కూతురు చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


ఈ వీడియోను వెయిట్‌లిఫ్టర్‌ సతీష్‌ శివలింగమ్‌ స్వయంగా తన ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. మీరాబాయి చాను స్పందించింది. ”ఈ చిన్నారి భలేగా చేసింది.. సో క్యూట్‌.. జస్ట్‌ లవ్‌ దిస్‌” అంటూ క్యాప్షన్‌ ను కూడా జత చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మరో మీరాబాయ్‌ చాను దొరికేసింది.. చిట్టి మీరాబాయి అదరగొట్టేసింది..” అంటూ కామెంట్లు చేశారు.