స్కూల్‎కి వెళ్తూ వాగులో పడ్డ టీచర్.. కాపాడిన సర్పంచ్

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు- కొలనుపాక గ్రామాల మధ్యలో ఉన్న వాగులో ఓ ఉపాధ్యాయురాలు స్కూటీతో సహా పడిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఉపాధ్యాయురాలు  హైదరాబాద్ నుంచి  బచ్చన్నపేటకు స్కూటీపై వెళుతున్న క్రమంలో అదుపు తప్పి వాగులో పడిపోయింది.

బచ్చన్నపేట మండలం పరమడకేశాపూర్ సర్పంచ్ గిద్దెల రమేష్  కారులో హైదరాబాద్ వెళుతున్న క్రమంలో ఈ ఘటను చూసి తన వాహనాన్ని ఆపి సహాయ చర్యలు చేపట్టారు. తన అనుచరులతో కలిసి వాగులోకి దిగి ఆమెను కాపాడి బయటికి తీశారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.