హైదరాబాద్ లంగర్ హౌస్ లో ఓ యువకుడి హత్య

young man killed

హైదరాబాద్‌ లో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 96  దగ్గర ఈ ఘటన జరిగింది. ఫైబర్ సర్కిల్ ఎదురుగా నడిరోడ్డుపై హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కత్తులతో నరికి చంపి అక్కడి నుండి పారిపోయారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల క్లూస్ టీమ్.. పాత కక్షల కారణంగా హత్య జరిగిందా ? లేక మరేమైన ఇతర కారణాలున్నాయా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.  హత్య కేసుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ గ్యాంగ్ గా ఏర్పడి ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.