ప్లీజ్.. నా సినిమా బాయ్‌కాట్‌ చేయొద్దు.. ఆమిర్‌ ఖాన్‌

దయచేసి తన సినిమా ‘లాల్‌సింగ్‌ చడ్డా’ను ఎవరూ బాయ్‌కాట్‌ చేయొద్దని బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ కోరారు. తాను హీరోగా నటించిన ‘లాల్‌సింగ్‌ చడ్డా’కు వ్యతిరేకంగా సోష్‌ల్‌మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమిర్‌ స్పందించారు. దేశభక్తి విషయంలో అందరూ తనని తప్పుగా అర్థం చేసుకొంటున్నారని, తాను భారతదేశాన్ని గౌరవిస్తున్నానని ఆమిర్‌ స్పష్టం చేశారు.

హాలీవుడ్‌ సినిమా ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమా చేస్తున్నారు. ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నాగచైతన్య కీలకపాత్ర పోషించారు. కరీనా కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.