అమీర్ ఖాన్ మూడో పెళ్ళికి సిద్దమయ్యాడా.. కూతురు వయసున్న హైదరాబాద్ అమ్మాయేనా!

Aamir Khan To Marry Heroine Fatima
Aamir Khan To Marry Heroine Fatima

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ముచ్చటగా మూడవ పెళ్ళికి సిద్దమైపోయాడా.. బీ టౌన్ లో తాజాగా ఈ వార్తే వైరల్ అవుతుంది. కమర్షియల్ సినిమాలకు దూరంగా కంటెంటున్న కథలను ఎంచుకుంటూ ప్రొఫెషన్ లో అమీర్ ఖాన్ మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ లైఫ్ లో మాత్రం ఆయన పెళ్లి మీద పెళ్లి చేసుకుంటుండటంతో కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పటికే తన మొదటి భార్య రీనా దత్తాకి 15ఏళ్ళ క్రితం విడాకులిచ్చాడు. ఇటీవల రెండో భార్య కిరణ్ రావు తోనూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ వార్త దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా తను మూడో పెళ్లి చేసుకుంటాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అది కూడా ‘దంగల్’ చిత్రంలో తనకు కూతురిగా నటించిన నటి ఫాతిమా సనా షేక్ తోనేనని పుకార్లు వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఫాతిమా ముంబై లో సెటిల్ అయిపోయింది.

ఫాతిమా తో పెళ్లి రూమర్స్ పై సైలెంట్ 

ఫాతిమాతో అఫైర్ కారణంగానే అమీర్ ఖాన్ కి కిరణ్ రావు విడాకులు ఇచ్చిందని బీ టౌన్ వార్తలు హల్ చల్ చేశాయి. ఐతే ఈ వార్తలను అమీర్ ఖాన్ ఖండించకపోవటంతో అందరికీ అనుమానాలు బలపడ్డాయి. దీనికి తోడు ఫాతిమాతో చెట్టాపట్టాలేసుకుని పార్టీలకి వెళ్లటం… హాలిడే టూర్స్ లో వీరిద్దరి ఫోటోలు వైరల్ కావటం కూడా పెళ్లి ఖాయమేనని ప్రచారం జరగటానికి కారణమవుతోంది.

గురువు లాంటి వ్యక్తి

ఫాతిమా మాత్రం అమీర్ ఖాన్ నాకు గురువు లాంటి వ్యక్తి అని చెబుతోంది. అంతకుమించి ఎలాంటి సంబంధం లేదని చెబుతూ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం వీరిద్దరూ పెళ్లికి రెడీ అయిపోయారంటూ వార్తలు రాస్తోంది. అమీర్‌ఖాన్‌, కరీనా కపూర్‌తో కలిసి నటిస్తున్న ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రం రిలీజ్ అయ్యాక వివాహానికి సంబంధించిన ప్రకటన చేస్తారని చెబుతున్నారు. అమీర్ సన్నిహితులు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు.