‘ఆట’ డ్యాన్స్ షో విన్నర్ అనుమానాస్పద మృతి

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆట డ్యాన్స్ రియాలిటీ షో ఫస్ట్ సీజన్ విన్నర్ టీనా మృతి చెందింది. డైరెక్టర్ ఓంకార్‌ నిర్వహించిన ఆట డ్యాన్స్‌ షోతో టీనా చాలా పాపులర్‌ అయ్యారు. ఆ తర్వాత సీజన్‌ 4కి జడ్జిగా కూడా వ్యవహించిన ఆమె.. గోవాలో అనమానాస్పదంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఆమె మరణానికి సంబంధించిన వివరాలు తెలియలేదు. టీనా సాధు మృతిచెందినట్లు ఆట సందీప్‌ తన ఇన్‌‎స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా.. ఇలా సడెన్‌‎గా మరణించడంపై సర్వత్రా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆట సందీప్‌ తన ఇన్‌‎స్టాగ్రామ్‌ ఖాతాలో టీనాతో ఉన్న ఫొటో పెట్టి.. ‘టీనా సాధు మరణవార్త విని ఎంతో షాకయ్యాను. ఆమె మరణం నన్ను ఎంతో బాధించింది. టీనా సాధు ఎంతో మంచి వ్యక్తి, ఆట సీజన్‌ 1లో నా పార్టనర్‌ కూడా. ఆమె మరణం పట్ల టీనా కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ఆట సందీప్‌ పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌‎గా మారింది. కాగా.. టీనా ఇన్నాళ్లుగా ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉన్నారు? అసలు ఆమె మరణానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు మాత్రం చాలా అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.