
సెప్టెంబర్ 5న అట్టహాసంగా మొదలుకానుందిబిగ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5. దీనికి సంబదించిన ప్రోమో రేపు 15న రిలీజ్ కానుందట. అయితే వీటికి సంబదించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకుండానే రోజుకో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 5. బుల్లితెరలో టాప్ షోగా దూసుకెళ్తున్న బిగ్ బాస్ షోకి సోషల్ మీడియా లోను క్రేజ్ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ వచ్చిందంటే చాలు పోటీ చేయబోతున్న కంటెస్టెంట్స్ ఎవరు.. సెలబ్రెటీలు ఎవరు అంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వార్తలొస్తుంటాయి.
బిగ్ బాస్ యాజమాన్యం కూడా డెసిషన్ తీసుకునేముందు కావాలనే సోషల్ మీడియాకి లీకులు ఇస్తుంటారు. నెటిజన్స్ నుండి పాజిటీవ్ స్పందన వస్తే వారిని ఫైనల్ చేస్తారు..లేదంటే పక్కన పెట్టేస్తారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ లీకుల పర్వం కొంచం రూటు మారి.. స్వయంగా పోటీచేయాలనుకుంటున్న కంటెస్టెంట్స్ నుండే వచ్చేసింది.
‘మమ్మల్ని బిగ్ బాస్ 5 హౌస్ లో చూడాలనుకుంటున్నారా’ అంటూ ఆట సందీప్ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టి షాక్ ఇచ్చాడు. ఇక ఆట సందీప్, ఆయన భార్య జ్యోతిలు చేసే డాన్స్ వీడియోలకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే అప్పట్లోనే ఈ కపుల్ ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారని బజ్ వచ్చింది. ఆ తరువాత కొన్ని రోజులకు ఇద్దరిలో ఎవరో ఒకరు రాబోతోన్నారంటూ రూమర్లు వినిపించాయి. ఇప్పుడు మాత్రం సందీప్, ఆయన భార్య జ్యోతిలు రాబోతోన్నట్టు లీకులు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆట సందీప్ తన ఫెస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ పెట్టాడు. మమ్మల్ని బిగ్ బాస్ 5హౌస్ లో చూడాలనుకుంటున్నారా అంటూ పోల్ పెట్టాడు. ఈ పోల్ కి విపరీతమైన రెప్సాన్స్ వచ్చింది.

సందీప్ పెట్టిన పోల్ కి దాదాపు 83 శాతం మంది అందుకు పాజిటివ్‌గా స్పందించారు. అంటే ఈ ఇద్దరినీ బిగ్ బాస్ ఇంట్లో చూడాలని నెటిజన్లు బాగానే ఆశపడుతున్నట్టున్నారు. మరి వారి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. అయితే బిగ్ బాస్ నుండి కన్ఫర్మేషన్ లేనిదే సందీప్ ఇలాంటి పోల్ పెట్టడని.. ఖచ్చితంగా ఎంట్రీ కన్ఫర్మ్ అయినంకనే.. ఇంకాస్త హైప్ కోసం ఇలా పోల్ పెట్టి ఉండొచ్చని..అప్పట్లో బిగ్ బాస్ లో దుమ్ముదులిపిన హీరో వరుణ్ సందేశ్, రితిక జంట వలే.. స్టార్ కపుల్ హోదాలో ఆట సందీప్, ఆయన భార్య జ్యోతిలు బిగ్ బాస్ 5లో అడుగుపెట్టనున్నారని మాత్రం స్పష్టం అవుతుంది.