ఏసీబీకి చిక్కిన మేడిప‌ల్లి ఎస్ఐ

acb-telangana

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా మేడిప‌ల్లి ఎస్ఐ యాద‌గిరి రాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.

బోడుప్ప‌ల్ అంబేద్క‌ర్ న‌గ‌ర్‌కు చెందిన న‌ల్లిక ప్ర‌శాంత్ దగ్గర ఓ కేసుకు సంబంధించి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ యాద‌గిరిని అదుపులోకి తీసుకున్న‌ట్టు ఏసీబీ అధికారులు వెల్ల‌డించారు.

ప్ర‌భుత్వ అధికారులు ఎవ‌రైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబ‌ర్ 1064కు కాల్ చేయాల‌ని ఏసీబీ అధికారులు సూచించారు.