వీడియో : అయ్యో పాపం.. అచ్చెన్నాయుడూ.. అలా పడిపోయావేంటీ? - TNews Telugu

వీడియో : అయ్యో పాపం.. అచ్చెన్నాయుడూ.. అలా పడిపోయావేంటీ?టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ కార్యక్రమంలో సోఫాలో కూర్చోబోయి తూలి కిందపడిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. శ్రీకాకుళంలో సర్దార్ గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభకు అచ్చెన్నాయుడు పాల్గొన్నాడు. ఇదే కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. సభ ప్రారంభమైన తర్వాత ఒక్కొక్కరిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు.. అప్పటికే వేదిక మీద కూర్చున్నాడు. ఆ తర్వాత అచ్చెన్నాయుడుని నిర్వాహకులు వేదిక మీదకు ఆహ్వానించారు. బాబాయ్ అయిన అచ్చెన్నాయుడు రాకను గమనించిన రామ్మోహన్ రాయుడు సోఫాలోంచి లేచి నిల్చున్నాడు.

నిర్వాహకులు వచ్చి పుష్ఫగుచ్చం అందించి అచ్చెన్నాయుడును ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయన సోఫాలో కూర్చున్నాడు. ఆయనది హెవీ బాడీ కావడం, సోఫా కూడా సరిగ్గా లేకపోవడంతో సోఫా అమాంతం వెనక్కి పడిపోయింది. సోఫాతో పాటు అచ్చెన్నాయుడు.. రామ్మోహన్ రాయుడు కూడా పడిపోయారు. ఆ దెబ్బకు సోఫా విరిగిపోయింది. ఈ ఘటనలో రామ్మోహన్ రాయుడు, అచ్చెన్నాయుడులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే.. వైసీపీ సోష‌ల్ మీడియా మాత్రం అచ్చెన్న హెవీ బాడీతో సోఫాకు ప్ర‌మాదం జ‌రిగింద‌ని సెటైర్లు విసర‌డం గ‌మ‌నార్హం.