తెలుగువారు దేనికి పనికిరారా.. ప్రకాష్ రాజ్ పై.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు

Actor Director Ravi Babu Sensetinal Comments On Maa elections
Actor Director Ravi Babu Sensetinal Comments On Maa elections
Actor Director Ravi Babu Sensetinal Comments On Maa elections
Actor Director Ravi Babu Sensetinal Comments On Maa elections

మా ఎన్నికలు రసవత్తర రాజకీయాలని తలపిస్తుంది. ఎన్నికలకు ముందు మేమంతా ఒకటే అన్నవారంతా ఇప్పుడు గ్రూపులుగా విడిపోయి ఒకర్నొకరు తిట్టుకుంటూ ప్రజల్లో చులకన అవుతున్నారు. భాష, ప్రాంత, కుల, మతాలకి సంబంధం లేని కల సినిమా. దీనికి సంబదించిన ఎన్నికల్లో కూడా ప్రాంతీయ బేధం తీసుకొచ్చి ప్రకాష్ రాజ్ పై అటాక్ చేస్తున్నాడు మంచు విష్ణు. తెలుగు వారి ఎన్నికల్లో మీ ఓటు ఇక్కడి వారికే వేసి తెలుగోడి ఆత్మగౌరవం నిలబెట్టాలని జోరుగా కాంపైన్ చేస్తుంది మంచు విష్ణు ప్యానల్. అయితే ఈ క్రమంలో వీరి వాదనకి బలం చేకూర్చేలా నటుడు దర్శకుడు రవిబాబు.. మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మన క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు వేషాలివ్వకుండా.. ఇతర భాషల నుంచి నటులను తెచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అలాగే.. హైదరాబాద్‌లో 150 నుంచి 200 మంది కెమెరామెన్లు ఖాళీగా ఉంటున్నారని.. వారిని కాదని ఇతర ప్రాంతాల నుంచి కెమెరామెన్లను తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదంతా కూడా ప్రొడ్యూసర్స్ ఛాయిస్ అని.. నిర్మాతలు ఎవరికి నచ్చిన టెక్నీషియన్స్ ని వారు పెట్టొకోవచ్చని చెప్పాడు. అయితే సినిమాల్లోనే కాకుండా ఇప్పుడు మా ఎన్నికల్లోనూ బయటివారిని నిలపెడుతున్నారని ఇన్ డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చాడు రవిబాబు. ‘మా’ అధ్య‌క్షుడిగా తెలుగు వారినే ఎన్నుకోవాలి అని ర‌విబాబు సూచించారు. తెలుగు న‌టుల కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థ ‘మా’. అలాంటి సంస్థ‌ను న‌డిపేందుకు మ‌న‌లో ఒక‌రైనా ప‌నికిరారా? అని ప్ర‌శ్నించారు రవిబాబు.