ప్యానెల్ సభ్యులతోపాటు శ్రీవారిని దర్శించుకున్న ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, మోహన్ బాబు

Actor Mohan Babu and Manchu Vishnu visiting tirumala temple today

Actor Mohan Babu and Manchu Vishnu visiting tirumala  temple today

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA) నూతన అధ్యక్షుడు మంచు విష్ణు, సీనియర్‌ నటుడు మోహన్‌బాబు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన ప్యానల్‌ సభ్యులతోపాటు తిరుమల వచ్చిన విష్ణు.. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

దర్శనం తర్వాత విష్ణు మీడియాతో.. ‘మా’ ఎన్నికల్లో గెలిచినందుకు స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చామని చెప్పారు. మా సభ్యులు కొందరు రాజీనామా చేసిన విషయం గురించి తమకు తెలియదని చెప్పారు. మీడియా ద్వారానే వింటున్నామని, వారి రాజీనామా లేఖలు తమకు అందలేదని చెప్పారు. వారి రాజీనామా లేఖలు వచ్చాక వాటిపై స్పందిస్తానని అన్నారు.

అనంతరం మోహన్ బాబు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తన బిడ్డ ఎంపిక కావడం చాల సంతోషంగా ఉందన్నారు. “నా బిడ్డని…. శ్రీ వేంకటేశ్వరుడు., పరమేశ్వరుడు., షిరిడి సాయి నాథుడు దీవెనలతో పాటు… అసోసియేషన్ సభ్యుల దీవెనలతో ప్రెసిడెంట్ గా గెలుపొందాడు. ఎంతో బాధ్యతతో కూడిన గౌరవ ప్రదమైనది మా అధ్యక్ష పదవి. గౌరవానికి ఎలాంటి భంగం రాకుండా నా బిడ్డ పరిపాలన చేస్తాడు”అని మీడియాకు తెలిపారు.