నాగబాబు vs నరేష్ : నాగబాబు మాటలు జాగ్రత్త.. నరేష్ ఆగ్రహం..!

Actor Naresh Fires on Nagababu
Actor Naresh Fires on Nagababu
Actor Naresh Fires on Nagababu
Actor Naresh Fires on Nagababu

టాలీవుడ్ లో ‘మా’ ఎన్నికల సమరం సెలబ్రెటీల మధ్య మాటల యుద్దానికి కారణమవుతుంది. ప్రకాష్ రాజ్ పెట్టిన రీసెంట్ ప్రెస్ మీట్ ‘మా’ లో కొత్త వివాదాలకు దారితీస్తుంది. నిన్న ప్రకాష్ రాజ్ కి మద్దత్తుగా మెగా కాంపౌండ్ నుండి హాజరైన నాగబాబు నరేష్ ప్యానల్ పై చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హీట్ పెంచింది. నిన్న నాగబాబు, బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి. అయితే తాజాగా నరేష్ ఇప్పుడు వాటికి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు.

ప్రెస్ మీట్ లో నరేష్ మాట్లాడుతూ ‘ నాగబాబు గారు నాకు మంచి మిత్రులు. ఆయన మా గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. మాటలు ఇంకొంచం జాగ్రత్తగా మాట్లాడితే బాగుండేది. ఆయన ఓ మాట అన్నారు. ‘మా’ నాలుగేళ్లుగా మసకబారింది అని. అలా అనడడం తప్పు.. మాతో నాలుగేళ్లుగా ఉన్నారు.. బైలాస్ ప్రకారం అలా అనకూడదు. గడిచిన రెండేళ్లలో ఏవో అక్కడక్కడా కొన్ని వివాదాలున్న పెద్దల సమక్షంలో అన్ని సమిసిపోయాయి. కుటుంబంలో కలహాలు సహజమే. అంతమాత్రాన నాగబాబు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మా మసకబారిందా.. ముందుకు వెళ్తోందా? అని మేం అంతా కూడా కలిసి చర్చించుకున్నాం. ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు.’ అని చెప్పారు నరేష్. ఇక నాగబాబు సపోర్ట్ చేస్తున్న ప్రకాష్ రాజ్ కి ఏమి తెలియదని.. మా మెంబర్స్ ఎంతమంది, సభ్యుల సంఖ్య ఎంత కూడా తెలియదని ప్రకాష్ రాజ్ కి చురకలు అంటించాడు నరేష్.